రాష్ట్రం ఏర్పడినా, తెలంగాణా ప్రజలకి ఒక ప్రత్యేక రాజకీయ శక్తి అవసరం
తెలంగాణా ప్రజలకి ప్రత్యేక రాష్ట్రం ఎంత ముఖ్యమో రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణా సమగ్ర అభివృద్ది అంతే ముఖ్యం.
కాంగ్రెస్ లో తెరాస విలీనం వార్తలు వస్తున్నా నేపద్యం లో, మనకు ఒక ప్రత్యేక రాజకీయ శక్తి ఎంత అవసరమో తెలపడమే ఈ వ్యాస ముఖ్య ఉద్దేశం.
ఇక్కడ కొన్ని విషయాలు గమనించతగ్గ ఆవశ్యకత వుంది. తెరాస వీలినం అయితే నే తెలంగాణా ఇస్తాం అంటె, కాంగ్రెస్ కు ప్రజల అభిప్రాయం అవసరం లేదా? పార్టీ ప్రయోజనాలే ముఖ్యమా? ఒక వేల తెరాస ఒప్పుకోక పోతె రాష్ట్రం ఇవ్వర? కాంగ్రెస్ నిబద్దత ఇంతేనా? . ప్రజలు ఒకసారి ఆలోచించాలి.
‘ హైదరాబాదు రాజధాని’గ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తరువాత, ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న అది వాళ్ళ ఇష్టం… కానీ ,
పది ఏళ్ళు ఉమ్మడి రాజధాని ప్రకటిస్తే మాత్రం ….మన రాజధాని మన సొంతం అయ్యేవరకు ‘తెరాస’ లాంటి ప్రత్యేక రాజకీయ శక్తి
ఆవశ్యకత మనకు ఎంతో వుంది. ఇప్పటి వరకు పాలసీలు, ఒప్పందాలు మనకు ఒరగబెట్టింది ఎమీ లేదు. ఇది చెరిత్ర చెప్పిన నిజం.
పది అన్నది ఇరవై కావొచ్చు …అసలు అమలే జరగక పోవొచ్చు. కాబట్టి, ప్రత్యేక రాజకియా శక్తి వుండి హైదరాబాదు పూర్తిగా దక్కేవరకు పోరాటం చేయడం అవసరము.
మనము కలలుకన్న అభివృద్ధి చెందిన రాష్ట్రం మనకు వుండాలి అంటె … ఏ ప్రాంతానికి సంబంధం లేకుండా కేవలం తెలంగాణా ప్రాంతానికే చెందిన
ఒక రాజకియా శక్తి, కేంద్ర నిధుల్లో గాని, మంత్రి పదవుల్లో గాని డిమాండ్ చేసే స్టేజిలో వుండాలి. అప్పుడే తెలంగాణాను మనము కలలు కన్న రీతిలో
చూడగలం. నేను నేషనల్ పార్టీ లకు వ్యతిరేకం కాదు , కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వాలే ఎక్కువ.
పొందిన రాష్ట్రానికి ‘సమైఖ్య రాష్ట్రం’లో జరిగిన అన్యాయాలు మరల జరగకుండా కేంద్ర ప్రభుత్వం
ప్రత్యేక దృష్టి సారించాలంటే ..దాన్ని శాసించే స్టేజి లో కొంత కాలం మన ప్రాంతానికి మాత్రమే చెందిన పార్టీ ఒకటి ఉండడము ఆవశ్యము అని భావిస్తున్న.
తెరాస విలీనం అయితనే తెలంగాణా ఇస్తాం లేక పోతె ఇవ్వం అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తే మాత్రం వారంతా మూర్ఖులు ఇంకా ఎవరు వుండరు.
ప్రజా ఉద్యమాలకి తల ఒగ్గని ప్రభుత్వాలు లేవు అని గుర్తుంచు కోవాలి.
ఒకవేళ తెరాస విలీనం చేస్తే, ఆ పార్టీ లో ఒక వర్గమో లేక వేరే వారో .. మరో ప్రత్యామ్న్యాయ రాజకీయ పార్టీ తప్పక ఏర్పాటు చేస్తారు అన్నది నా అభిప్రాయం.
కాబట్టి తెరాస ఆ ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వకూడదు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణా ఉద్యమం ఈ స్టేజి కి రావడానికి తెరాస నే కారణం అన్నది
జగమెరిగిన అక్షర సత్యం.