తెలంగాణపై కాంగ్రెస్ నుఉతికిపారేసిన సుష్మా


న్యూఢిల్లీ : పార్లమెంటులో 'తెలంగాణం' మారుమోగింది. తెలంగాణ ఎందుకివ్వరంటూ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కాంగ్రెస్ను నిలువునా కడిగేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్పార్టీ అడుగడుగునా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004 ఎన్నికల సందర్భంగా సోనియాగాంధీ కరీంనగర్లో తెలంగాణ ఇస్తామని ప్రకటించారు.. డిసెంబర్ 9 ప్రకటనకు ముందు అఖిలపక్ష మీటింగ్లో తెలంగాణకోసం తీర్మాణం చేశారు.. తెలంగాణ కావాలంటూ 13 మంది ఎంపీలు రాజీనామాలు చేశారు.. వందలాది మంది అమాయకులు ప్రాణాలు తీసుకున్నారు.. నిన్నగాక మొన్న యాదిరెడ్డి అనే యువకుడు తెలంగాణ కోసం ఢిల్లీదాక వచ్చి పార్లమెంటు సాక్షిగా ఆత్మబలిదానం చేశాడు... ఇంత కంటే ఇంకేం కావాలి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వడానికి?.. అని పార్లమెంటులో సుష్మాస్వరాజ్ తెలంగాణ ఘోషను వినిపించారు. సుష్మాస్వరాజ్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నంతసేపూ కేంద్ర మంత్రి చిదంబరం మొహం వాడిపోయింది. సీమాంధ్ర ఎంపీలందరూ సైలెంటయిపోయారు. ఏంచేయాలో తెలియక కావూరి సాంబశివరావు సహనం కల్పోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. అసంబద్దమైన వ్యాఖ్యలతో బీజేపీపై ఎదురుదాడికి దిగారు. ఒకానొక సందర్బంలో కావూరిని అధికార పక్ష నేతలే మందలించారు. చిదంబరం సైతం కావూరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Your Ad Here